ADB: బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. మంగళవారం ఆయా మండల కేంద్రాల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన గొడవకు ఉట్నూర్ పోలీసులు ప్రస్తుతం జాన్సన్ నాయక్ పై కేసును నమోదు చేశారన్నారు.