NLG: పెద్దవూర మండల నూతన తహశీల్దార్ బానోతు ఖాసీం నాయక్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా డీఎంసీఎస్ కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన ఆయన, రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ శ్రీదేవి ఎఫ్ఎసీగా పనిచేశారు. తహశీల్దార్‌కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.