MHBD: తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన సంతకం లేకుండా చెక్కును ఎలా పాస్ చేశారని గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్‌ను ఉప సర్పంచ్ మొగుళ్ల లింగన్న గౌడ్ నిలదీశారు. ఈ విషయంపై స్పందించిన కార్యదర్శి రూ.1,44,000లను జీపీ సిబ్బందికి చెల్లించినట్లు వెల్లడించారు.