SDPT: క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని 19వ వార్డులో యువతకు క్రికెట్ కిట్టు పంపిణీ చేసి మాట్లాడారు. త్వరలోనే సిద్దిపేటలో పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు చేయూతనిస్తుందని ఆయన పేర్కొన్నారు.