SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామంలో రంజాన్ సందర్భంగా శనివారం మసీదు ప్రాంగణంలో శుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో మసీదు ప్రాంగణాన్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. రంజాన్లో భక్తులు ఎక్కువగా మసీదుకు హాజరవుతారని, అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ ఈ సందర్భంగా తెలియజేశారు.