NLG: చండూరు మున్సిపాలిటీలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’ ఆన్ ఫీల్డ్ అసెస్మెంట్ కొనసాగింది. ప్రతి వార్డులో డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, గృహస్థులు హోమ్ కంపోస్టింగ్ చేస్తున్న తీరును అధికారులు సుధాకర్ రెడ్డి, దేవి రెడ్డి పరిశీలించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణను తనిఖీ చేసి, మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు పలు సూచనలు చేశారు.