KNR: కరీంనగర్ జ్యువెల్లరీ షాప్ కాల్పుల ఘటనలో గాయపడి కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.