MNCL: బెల్లంపల్లి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది తెలుగు సంవత్సరాది (శ్రీ విశ్వావసు) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పంచాంగ శ్రవణ పఠనం ఏర్పాటు చేశారు. వేద పండితులు అప్పల శ్యాం ప్రణీత్ శర్మ పంచాంగ పఠనం హాజరైన పట్టణ ప్రజలకు వినిపించారు. ప్రజలందరూ శాంతియుత మార్గంలో భక్తిశ్రద్ధలతో కలిగి ఉండాలని సూచించారు.