HYD: HCUలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని గమనిస్తూ పోలీసులు భద్రతను పెంచారు. HCUలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో రాజకీయ నాయకుల కదలికలపై పోలీసులు కన్నేశారని తెలుస్తోంది. ఇప్పటికే MLA క్వార్టర్స్ వద్ద బీజేపీ MLAలను అరెస్ట్ చేశారు.