చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రంగనాయకుల మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.