నిన్న వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొదటి 2 ర్యాంకులు అమ్మాయిలవే కాగా.. 25 ర్యాంకుల్లో పదకొండు మంది అమ్మాయిలే ఉండటం గమనార్హం. శక్తి దూబే(1), హర్షిత గోయల్(2), షా మార్గి చిరాగ్(4), కోమల్ పునియా(6), ఆయుషీ బన్సల్(7), సాయి శివాని(11), ఆషీ శర్మ(12), సంస్కృతి త్రివేది(17), సౌమ్య మిశ్రా(18), రియా సైనీ(22), గీగీ ఏఎస్ 25వ ర్యాంకు సాధించారు.