PLD: అమరావతి మండలం ఉంగుటూరులో లబ్ధిదారులకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసి, వారి జీవనోత్సాహాన్ని మరింత పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. లబ్ధిధారులందరూ ఆర్థిక భద్రతతో, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.