TPT: పుత్తూరు మండలం బత్తల వారి కండిగ గ్రామంలో ఓ ఇంట్లో బెడ్‌పై నాగుపాము కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ శ్రీకాంత్‌కు సమాచారం అందజేశారు. అతను ఆ పామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.