NLG: శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వాటర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో నెలకొన్న పలు అంశాలపై మంత్రితో చర్చించారు. మంత్రిని కలిసిన వారిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరిగే నరసింహ, బోడ అరుణ్, తోటకూరి పరుశురాం, కళ్యాణ్, వేముల గోపీనాథ్ తదితరులు ఉన్నారు.