PLD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు దుర్గి మండలంలో పర్యటించారు. స్వయంగా ఆయన లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.