చిత్తూరు: పుణ్య క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో అమ్మవారికి పూజలు చేసి మొక్కుబడులు చేసుకునేందుకు తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.