HYD: రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు వరం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సన్న బియ్యం పంపిణీ చేశారు.