ELR: సీడ్, ఫీడ్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% పన్నులు విధిస్తామని చెప్పడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా నుంచి అమెరికా ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇదే అదునుగా ఎగుమతిదారులు కౌంట్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 తగ్గించారని రైతులు లబోదిబోమంటున్నారు.