ELR: కోకో రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గురువారం జిల్లా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తీసుకువెళ్లింది. అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోకో గింజలు కొనుగోలు, ధరల సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు అచ్చెన్నాయుడికి వినతిపత్రం అందజేశారు.