VSP: హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12న జరగనున్న హనుమాన్ శోభాయాత్ర – బైక్ ర్యాలీ పోస్టర్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పెందుర్తి, గాజువాక, ఆనందపురం, మారియట్ హోటల్, పోస్టాఫీస్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సాయంత్రం 5గంటలకు పార్క్ హోటల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి కాళీమాత ఆలయం వరకు సాగుతుందన్నారు.