SRCL: వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తుల పోటెత్తారు. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.