గుంటూరు జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో సచివాలయాల సంఖ్యను దాదాపు 30 శాతం వరకు తగ్గించనున్నారు. ప్రధానంగా గుంటూరుతో పాటు అన్ని మున్సిసిపాలిటీల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకు తగ్గనున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒకటి యథాతథంగా కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1334 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి.