SRD: సదాశివపేట పట్టణంలో మంగళవారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పంచముఖ హనుమాన్ దేవాలయం నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు భజన చేస్తూ భక్తులు ముందుకు సాగారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే పాల్గొన్నారు.