BPT: మాజీ ఉపసర్పంచ్ పీటా మంగమ్మ మృతి పార్టీకి తీరని లోటు అని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం చెరుకుపల్లి మండలం అరుంబాక పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పీటా మంగమ్మ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగమ్మ పార్టీకి అనేక సేవలు చేశారని, ఆమె సేవలు మరువలేమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పూషాడపు కుమారస్వామి ఉన్నారు.