GNTR: జిల్లాలో మంగళవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 31న ముగియాల్సి ఉంది. అయితే నిన్న రంజాన్ పండుగ కావడంతో చివరి సబ్జెక్ట్ సోషల్ పరీక్ష నేటికి వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉన్న పరీక్ష కేంద్రం నుండి ఇంటికి తరలి వెళ్లారు.