BNR: పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించింది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అని, దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం పథకం ప్రారంభించిందన్నారు.