చిత్తూరు: నగరి మండలం ఏకాంబర కుప్పం పంచాయతీ పరిధిలోని తరణి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో విచ్చలవిడిగా శ్మశానాలను సైతం తోడేస్తున్నారు. స్థానికులు సమాచారంతో ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.