PLD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా నరసరావుపేట మండలం గురువాయపాలెం గ్రామంలో మంగళవారం పశువుల కోసం నీటి నిల్వల నీటి కుంటలను ఏర్పాటుకు ఎమ్మెల్యే అరవిందబాబు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోడానికి, పశువులకు వేసవికాలంలో దాహం తీర్చడానికి నీటికుంట ఏర్పాటు చేస్తున్నామన్నారు.