HYD: నగర రవాణాలో ఆకర్షణీయంగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లుగా HMDA తెలిపింది. కొండాపూర్ నుంచి గచ్చిబౌలికి కొత్తగా ప్రారంభించిన పీజేఆర్ వంతెన, జూన్-జూలైలో అభివృద్ధి చేసిన అండర్పాస్ ఆకర్షణీయ దృశ్యాలతో నగర రవాణాలో కొత్త ఒరవడిని తెచ్చాయని పేర్కొంది. ఉష్ణమండల, స్వదేశీ మొక్కలు, వంకర ఆకుపచ్చ పొరలు, గోళాకార పచ్చిక మైదానాలు, నడక మార్గాలు ఏర్పాటు చేశారు.