MDK: రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక లారీ యూరియా రావడంతో రైతులకు ఒకరికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. గత 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.