HYD: రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఆర్టీసీతో పాటు మిగతా డ్రైవర్లు సైతం అవగాహన పెంచుకోవాలన్నారు.