VKB: నవాబ్‌పేట్ మండల బస్టాండ్ ప్రాంగణంలో భీమ్ దీక్ష ఈ రోజు 6వ రోజుకు చేరి ఉత్సాహంగా కొనసాగింది. మార్చి 15న మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దివిటి ఆనందం ప్రారంభించిన దీక్ష, అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.