MHBD: వంట గ్యాస్ పంపిణీపై ప్రజలు ఆందోళన చెందవద్దని దంతాలపల్లి తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి సూచించారు. గ్యాస్ సిలిండర్ల కోసం నర్సింహులపేట గోదాం వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలోనే నేరుగా గ్రామాలకే వాహనాలు పంపి ఇంటి వద్దే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.