BHNG: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ కంతి మధు అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజిపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.