KNR: కాంగ్రెస్ చేనేత రాష్ట్ర కార్యదర్శిగా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందినకూరపాటి రామచంద్రం నియమకం అయ్యారు. ఈ మేరకు ఆయనకు చేనేత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.