HYD: గ్యాస్ సిలిండర్ను 2 రోజుల్లోనే డెలివరీ చేస్తామని చెప్తూ సైబర్ నేరగాళ్లు ప్రత్యేక లింకులు పంపుతున్న ఘటనలు ఉప్పల్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్ సహా పలు చోట్ల వెలుగు చూశాయి. ఈ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మెసేజ్లు నమ్మకుండా వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.