NLG: రూ. కోట్లు పెట్టి నిర్మించిన చిట్యాల పురపాలక వైకుంఠధామంలో సౌకర్యాల లేమి అద్దం పడుతోంది. గురువారం రాత్రి మునుగోటి వెంకన్న అనే వ్యక్తి అంత్యక్రియల సమయంలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో, సెల్ఫోన్ టార్చ్ లైట్ల సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు ఉన్నా దీపాలు అమర్చకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.