కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సిరికొండ సుదర్శన్ చారిని కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ మేరకు ఆదివారం ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభరాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం నియామక పత్రాన్ని అందజేశారు. సుదర్శన్ చారి మాట్లాడుతూ.. సంఘ సభ్యుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.