NRML: జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల్లోని మహిళా ఉద్యోగులను కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.