SRPT: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు అనంతగిరిలో గ్రామపంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో హరి సింగ్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడారు.