WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు పుష్పితలయ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో కవితను కలిసి పూలబుకే అందజేసి, తూర్పు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. నగరంలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని కవిత ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పలువురు నాయకులున్నారు.