SDPT: హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియపై అధికారులు, రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యార్డులో మొక్కజొన్న నిల్వకు మాత్రమే స్థలం ఉండగా, వరి ధాన్యానికి సౌకర్యం లేదని తెలిపారు. అందువల్ల రైతులు సమీప ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు.