VKB: ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ఆదర్శవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.నర్సిములు అధికారులను ఆదేశించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.