PDPL: ధర్మారం మండలంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శనివారం ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా గుమికూడవద్దని ప్రజలను కోరారు.