MBNR: బాదేపల్లి పాతబజార్కు చెందిన హమాలీ సుంకసారి శ్యామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రాయచూర్ డెమో ఎక్స్ప్రెస్ కింద పడి తనువు చాలించాడు. రైల్వే ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము వివాహమై 14 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండంతో శ్యామ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు.