MBNR: పాలమూరు యూనివర్సిటీ ఓఎస్డీగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. బుధవారం నియామక పత్రాన్ని యూనివర్సిటీ ఉపసంచాలకులు జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ పరిపాలన వ్యవహారాలలో మధుసూదన్ రెడ్డికి ఎంతో అనుభవం, సేవా దృక్పథం యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు.