SRD: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు మరింత నైపుణ్యం సాధించేందుకు ఫైరింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పారు. సంగారెడ్డిలోని ఫైరింగ్ కేంద్రంలో పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో సమర్థవంతంగా పనిచేసేందుకు ఫైరింగ్ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.