KMM: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైరా మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, సీఐటీయూ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ వీవోఏల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని మాస్ లైన్ నేత పుల్లయ్య పేర్కొన్నారు.