HNK: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. జిల్లాలోని పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ CM రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, CM రిలీఫ్ ఫండ్ పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.