KRNL: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆలూరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి కుటుంబసభ్యులతో కలిసి సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ప్రార్థించినట్లు తెలిపారు.